సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

February 23, 2022

02

భారత రైల్వే శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన ‘జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఎలా చేయాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జీతభత్యాలు ఎంత, ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే వివరాల్లోకి వెళ్తే..

మొత్తం ఖాళీల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ పోస్టులు

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్‌/బీఎస్సీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిప్యూటీ చీఫ్‌ పర్సనల్ ఆఫీసర్‌ (కన్‌స్ట్రక్షన్), సెంట్రల్‌ రైల్వే, ముంబై, మహారాష్ట్ర-400001.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళా అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

https://cr.indianrailways.gov.in