రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ లబ్దిదారుల లిస్టు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ లబ్దిదారుల లిస్టు విడుదల

May 14, 2022

పీఎం కిసాన్ సమ్మాన్ లబ్దిదారుల లిస్టును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం రైతులకు 6 వేల రూపాయలను ఏటా మూడు విడతల్లో ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అనర్హులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో భారీ వడపోతల అనంతరం కేంద్రం తాజా లిస్టు ప్రకటించింది. రైతులు ఈ – కేవైసీ స్టేటస్‌లో తమ పేరు ఉన్నదీ లేనిదీ తెలసుకోవచ్చు. ఈ నెలలోపు నగదు సహాయం ఆయా ఖాతాల్లో జమకానుంది. రైతులు తమ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ సమ్మాన్ స్కీం వెబ్‌సైటులోకి వెళ్లాలి. తర్వాత కుడివైపున ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది. దాంట్లో బెనిఫిషరీ స్టేటస్‌పై క్లిక్ చేస్తే ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబరు ఎంటర్ చేయాలని చూపిస్తుంది. ఏదో నెంబర్ ఎంటర్ చేశాక గెట్ డాటాను క్లిక్ చేస్తే మొత్తం లావాదేవీల సమాచారం ఉంటుంది. ఇదికాక, ఈ పథకానికి సంబంధించిన ఏమైనా అనుమానాలుంటే నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు. ఇందుకోసం హెల్ప్‌లైన్ నెంబరు ఉంటుంది. 155261 లేదా 011-24300606 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.