ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాలలో 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 29న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. రాష్టవ్యాప్తంగా 1,31,608 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రాజమండ్రికి చెందిన చల్లా సత్యహర్షిత మొదటి ర్యాంక్ సాధించగా, కాకినాడకు చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ రెండో ర్యాంక్, అదే ప్రాంతానికి చెందిన సాయి భవ్యశ్రీ మూడో ర్యాంక్ సాధించారు. ఈసారీ కూడా అమ్మాయిలే పైచేయి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 93.96%తో అమ్మాయిలు మొదటి స్థానంలో నిలిచారు. కోవిడ్ వల్ల రెండేళ్లు పాలిసెట్ జరగలేదని, ఈసారి ఫలితాలను చూస్తే గర్వంగా ఉందని మంత్రి బుగ్గన అన్నారు.