రైతులకు ఊరట.. రుణమాఫీ నిధులు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు ఊరట.. రుణమాఫీ నిధులు విడుదల

May 7, 2020

వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్ వీడియోలు.. ఖంగుతిన్న ఎంపీలు, స్పీకర్   ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా కంప్యూటర్ స్క్రీన్ మీద పోర్న్ చిత్రాలు దర్శనమివ్వడం పెద్ద దూమారం రేపింది. ప్రజా సమస్యల మీద సీరియస్‌గా చర్చ జరుగుతున్న  సమయంలో ఉన్నట్టుండి పోర్న్ వీడియోలు ప్రత్యక్షం కావడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.  ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పార్లమెంటు సమావేశంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరుస్తున్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు నేరుగా సమావేశం కాకుండా వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్, ఛైర్ ఉమెన్ అయిన థండీ మోడిసే వ‌ర్చువ‌ల్ స‌మావేశాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం జూమ్ వీడియో కాలింగ్ ద్వారా జరుగుతున్నట్లుగా పమాచారం.  చర్చలు జరుగుతుండగా అక‌స్మాత్తుగా వీడియో కాన్ఫరెన్స్ తెరపై నీలి చిత్రాలు వచ్చేశాయి. దీంతో స్పీక‌ర్ సహా సమావేశంలో ఉన్న సభ్యులంతా ఖంగుతిన్నారు. అయితే, ఈ పనిని హ్యాకర్లు చేసినట్లుగా గుర్తించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను హ్యాక్ చేసిన వారు స్పీక‌ర్‌పై అసభ్య వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో పార్లమెంటు స‌భ్యులు మ‌రో లింక్‌ ద్వారా తమ సమావేశాలను కొనసాగించారు. కాగా, జూమ్ యాప్ ద్వారా మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించవద్దని గతంలో స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అయినా సాంకేతిక సిబ్బంది అందులోనే వీసీ నిర్వహించడంపై థండీ మోడిసే మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా జూమ్ సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే భారత ప్రభుత్వం కూడా ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. వేరే యాప్ నిర్వహణకు కోటి రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.   South Africa parliament zoom call hacked with pornography, racial abuse  South Africa, Zoo, Porn Videos, Video Conference, PM, Shock

రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల నుంచి రూ. లక్ష లోపు రైతురుణాల మాఫీ కోసం రూ. 1,200 కోట్ల నిధులు విడుదల చేశారు. రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు నిధుల విషయమై ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆద్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిలు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 6.10 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. నాలుగు విడతలుగా చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు.   

రూ. 25 వేల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బును జమ చేయాలని.. లక్ష లోపు ఉన్నవారికి నాలుగు విడతల్లో రుణాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘వానాకాలం పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను కూడా విడుదల చేశాం. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ. 7 వేల కోట్లను పంట సీజన్‌ ప్రారంభం నాటికే రైతులకు అందిస్తాం. వానాకాలం పంటకు విడుదల చేసిన రైతు బంధు మొత్తాన్ని రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ చేస్తాం’ అని మంత్రి తెలిపారు.