ఎల్లుండే జార్జిరెడ్డి విడుదల.. U/A సర్టిఫికెట్‌తో సెన్సార్ ఆమోదం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎల్లుండే జార్జిరెడ్డి విడుదల.. U/A సర్టిఫికెట్‌తో సెన్సార్ ఆమోదం..

November 20, 2019

Released by Nov 22 Georgi Reddy Movie.. Sensor Approval with U A Certificate.

విడుదలకు ముందే వివాదాలతో సంచలనంగా మారిన ‘జార్జిరెడ్డి’ చిత్రానికి సెన్సార్ ఆమోదం తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌ను అందించింది. తమకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని ఓ వర్గంవారు అంటున్న విషయం తెలిసిందే. విప్లవ ధృవతారగా 1960-70 దశకంలో ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు జార్జిరెడ్డి. ‘స్కాలర్‌షిప్పులు రాకున్నా, ఏం చేసినా  గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్.. జీనా హైతో మర్‌నా సీఖో’ అంటూ నినదించాడు మన జార్జిరెడ్డి. అన్యాయాలపై పోరాడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తూ ‘ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్’లా గర్జించాడు. కేరళలోని పాల్ఘాట్‌లో పుట్టిన జార్జిరెడ్డి విప్లవమే ఊపిరిగా సమసమాజ స్థాపన కోసం తన ఆయువునే ధారపోశాడు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఆయన చరిత్ర ఈ తరానికి తెలియజెప్పే క్రమంలో ఆయన జీవితం ఆధారంగా ‘జార్జిరెడ్డి’ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే.

దళం జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రోగ్రెసివ్ డెమొక్రెటివ్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్‌యూ)ని స్థాపించి యూనివర్సిటీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. దశాబ్దాల కిందట హీరోగా నిలిచిన జార్జిరెడ్డి ఉస్మానియా క్యాంపస్‌లోనే హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయన స్ఫూర్తివంతమైన జీవిత కథను ఈ తరానికి తెలియజెప్పే క్రమంలో ఈ చిత్రం రూపొందింది. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే క్రమంలో వివాదాలు చుట్టుముట్టాయి. సిల్లీమోంక్స్‌, త్రీలైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.