ఏడాది ఫ్రీ.. రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏడాది ఫ్రీ.. రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్..

March 1, 2018

టెలికం రంగంలో చవక ఆఫర్లతో దూసుకెళ్తున్న రిలయలన్స్ మరో సంచలన ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ బిగ్ టీవీ ఆకర్షణీయమైన టీవీ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. 500 వరకు చానళ్లను ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. వినియోగదారులు హెచ్‌వీఈసీ సెట్ టాప్‌బాక్స్‌ను కొనాల్సి ఉంటుంది.  అన్ని హెచ్‌డీ పే చానల్స్‌తోపాటు ఫ్రీ టు ఎయిర్ చానళ్లను ఏడాది ఉచితంగా అందిస్తారు. నేటి నుంచి అధికారిక వెబ్‌సెట్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి.  

బుకింగ్ సమయంలో తొలుత రూ.499 చెల్లించాలి.  యూనిట్ డెలివరీ తర్వాత మిగతా రూ.1500 కట్టాలి. ఏడాది ఉచిత ఆఫర్ ముగిసిన తర్వాత నెలకు రూ.300తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లపాటు రీచార్జ్ చేసుకున్న తర్వాత తొలుత చెల్లించిన రూ.2 వేలను వెనక్కి ఇచ్చేస్తారు. హెచ్‌డీ హెచ్ఈవీసీ సెట్ టాప్ బాక్స్‌తో రికార్డింగ్, యూఎస్‌బీ పోర్ట్, యూట్యూబ్ యాక్సెస్‌తోపాటు రికార్డింగ్ చేసుకుంటూనే మరో చానల్‌ చూసే సదుపాయం ఉంటాయి. ప్ర‌ధాని మోదీ డిజిట‌ల్ ఇండియా విజన్ కింద 130 కోట్ల మందికి హెచ్‌డీ నాణ్య‌త క‌లిగిన వినోద చాన‌ళ్ల‌ను ఉచితంగా అందించడానికి దీన్ని తీసుకొస్తున్నామని బిగ్ టీవీ తెలిపింది.