అమ్మవారికి అంబానీ 20 కేజీల బంగారు కానుక   - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మవారికి అంబానీ 20 కేజీల బంగారు కానుక  

November 7, 2020

ప్రముఖ వ్యాపార దిగ్గజం, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి భక్తి ఎక్కువే. తిరుమల ఆలయం నుంచి చార్‌ధామ్ ఆలయాల వరకు అన్నీ ఆయనకు ముఖ్యమైనవే. ముంబై సిద్ధివినాయక స్వామికి భారీ విరాళాలు అందజేసే ఆయన ఈసారి అస్సాంలోని కామాఖ్య ఆలయానికి కళ్లు తిరిగే సువర్ణ కానుక అందించారు. దీపావళిని పురస్కరించుకుని తన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున కామాఖ్యదేవికి 20 కేజీల బంగారం అందించారు. దీని వెలువల దాదాపు రూ. 10 కోట్లు. ఈ పసిడితో ఆలయపైభాగంలో బంగార తాపడంతోపాటు మూడు బంగారు కలశాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని ఆలయ అధికారులు చెప్పారు. 

దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో కామాఖ్య ఆలయం ఒకటి. అక్కడి అమ్మవారు శక్తిమంతురాలని, కోరిక కోరిన నెరవేరుస్తుదని భక్తల నమ్మకం.  ఈ గుడిని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. విషయం తెలుసుకున్న అంబానీ తన వంతుగా ఏదైనా చేస్తానని ముందుకొచ్చారు. బంగారు కలశాలను అందిస్తే బావుంటుందని పూజారులు ఆయనకు సూచించారు.