ముకేశ్ అంబానీ..తొలిసారి ఫోర్బ్స్ టాప్-10లోకి  - MicTv.in - Telugu News
mictv telugu

ముకేశ్ అంబానీ..తొలిసారి ఫోర్బ్స్ టాప్-10లోకి 

November 28, 2019

reliance industries owner Mukesh Ambani o 9th richest in the world

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో దూసుకెళ్లారు. టాప్-10 కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. రిలయన్స్ సంపద ఈరోజు రూ.10 లక్షల కోట్ల మార్కును అందుకోవడంతో ముఖేశ్ అంతర్జాతీయ కుబేరుల జాబితాలో దూసుకెళ్లారు.

ప్రపంచ ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య పరిణామాల ఆధారంగా ఫోర్బ్స్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంటుంది. ఈ విధంగా ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ముఖేశ్ కు 9వ ర్యాంకు లభించింది. ఈ క్రమంలో ఆయన గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లను వెనక్కి నెట్టారు. లారీ పేజ్ సంపద 59 బిలియన్ల డాలర్లు కాగా, ముఖేశ్ సంపద విలువను ఫోర్బ్స్ 60.8 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఫోర్బ్స్ టాప్-10 జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలవగా.. బిల్ గేట్స్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 90వ స్థానంలో భారత్ కు చెందిన శివ్ నాడార్(15.2 బిలియన్లు), 97వ స్థానంలో ఉదయ్ కోటక్ (14.4 బిలియన్ల) ఉన్నారు. 

 

ప్రపంచ కుబేరుల జాబితా

 

  1. జెఫ్ బెజోస్ (అమెజాన్) 113 బిలియన్లు

 

  1. బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్) 107.4 బిలియన్లు

 

  1. బెర్నాడ్ ఆర్నాల్డ్ ఫ్యామిలీ 107.1 బిలియన్లు

 

  1. వారెన్ బఫట్ (బెర్క్సేన్ హతావే) 86.9 బిలియన్లు

 

  1. మార్క్ జుకర్బర్గ్ (ఫేస్‌బుక్) 74.9 బిలియన్లు

 

  1. లారీ హిల్సాన్ 69.2 బిలియన్లు,

 

  1. అమంసియో అర్టెగా 69 బిలియన్లు

 

  1. కార్లోస్ స్లిమ్ హెలు ఫ్యామిలీ 60.8 బిలియన్లు

 

  1. ముఖేశ్ అంబానీ 60.8 బిలియన్లు

 

  1. లారీ పేజ్ (గూగుల్) 59 బిలియన్లు