రిలయన్స్‌కు ఒక్కరోజే రూ.90 వేల కోట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

రిలయన్స్‌కు ఒక్కరోజే రూ.90 వేల కోట్లు..

August 13, 2019

Reliance Industries.

వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి ఎగబాకొచ్చు.. ఒక్కోసారి కుప్పకూలవచ్చు. అదే జరిగింది ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విషయంలో. ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,54,478 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు రిలయన్స్  పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అనూహ్యంగా రిలయన్స్ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 90 వేలకోట్లకు పెరిగింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 12 శాతం పెరగడంతో ఇది సాధ్యమైంది. ఈ సందర్భంగా వచ్చే 18 నెలల్లో మొత్తం రుణాలను తీర్చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

మరి ఈ షేర్లు ఇంతగా పెరగడానికి కారణం ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా పేరు గాంచిన సౌదీ అరామ్‌కో కంపెనీయే. ఆ కంపెనీ 15 బిలియన్ డాలర్లను తమ కంపెనీలో పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు రిలయన్స్ ప్రకటించడంతో షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిఫైనింగ్ వ్యాపారంలో 20 శాతం వాటా కోసం ఈ పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరామ్‌కో నిర్ణయించిందని రిలయన్స్ తెలిపింది.