రిలయన్స్ దూకుడు.. ముదాదాలాతో 10 లక్షల కోట్లకు.. - MicTv.in - Telugu News
mictv telugu

రిలయన్స్ దూకుడు.. ముదాదాలాతో 10 లక్షల కోట్లకు..

June 5, 2020

Reliance Industries.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మహాదూకుడు ప్రదర్శిస్తోంది. విదేశీ పెట్టుబడుతో దేశంలో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. అబూదాబికి చెందిన ముబాదాలా కంపెనీ రిలయల్స్‌లో రూ 9,093.60 కోట్లు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో రిలయన్స్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రికార్డు సృష్టించింది. దీనిపై కంపెనీ అధినేత
ముఖేశ్ అంబానీ హర్సం వ్యక్తం చేశారు. ఇన్వెస్టింగ్ దిగ్గజం ముదాదాలా తమతో చేతులు కలపినందుకు సంతోషంగా ఉందని,  డిజిటల్ రంగంలో భారత్ అగ్రగామి దేశంగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ముబాదాలా ప్రకటనతో ఈ రోజు రిలయన్స్ షేర్ విలువ 2.39 శాతం పెరిగింది. గత 52 వారాల్లో ఇదే అత్యధిక ధర.
రిలయన్స్ జియో టెలికం, డిజిటల్ రంగాల్లో చక్కని పనితీరు కనబరుస్తుండడంతో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఫేస్బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గత నెలన్నరలోనే రూ. 87,655.35 కోట్లు వచ్చాయి. చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈరోజు స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ షేర్ విలువ 2.39 శాతం పెరిగింది.