జియో మరో ఊరట.. కొంత టాక్ టైమ్ ఉచితం  - MicTv.in - Telugu News
mictv telugu

జియో మరో ఊరట.. కొంత టాక్ టైమ్ ఉచితం 

October 12, 2019

Reliance jio 30 minutes free talk time 

ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాలంటూ కస్టమర్లకు ఊహించని ఝలక్ ఇచ్చిన జియో రిలయన్స్ మెట్లు దిగుతోంది. ఇప్పటికే రీచార్జి చేసుకున్న వారికి ప్లాన్ పూర్తయ్యేంతవరకు ఈ నిబంధన వర్తించదని చెప్పిన కంపెనీ మరో ఊరట కల్పించింది.  ‘6పైసల’ నిబంధన ప్రకటించిన తర్వాత తొలిసారి జియో రీచార్జి చేయించుకున్న వారికి 30 నిమిషాల టాక్ టైమ్ ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది. ఇది వన్ టైమ్ ఆఫర్ అని, వారం రోజలు మాత్రమే అమల్లో ఉంటుందందని కంపెనీ వర్గాలు చెప్పాయి.

జియో ‘6పైసల’ నిబంధనలు పలువురు వేరే నెట్ వర్కులకు మారుతున్నారు. కొత్తవారు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. తాజాగా ప్రకటించిన 30 నిమిషాల ఫ్రీ టాక్ టైమ్ కూడా గిమ్మిక్కు మాత్రమేనని, కస్టమర్లు త్వరగా రీచార్జి చేయించుకోడానికి వేసిన ఎత్తుగడ అని అంటున్నారు.