రిలయన్స్ జియో సరికొత్త రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

రిలయన్స్ జియో సరికొత్త రికార్డు

April 15, 2019

వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించింది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నర సంవత్సరాలలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో రెకార్డులోకి ఎక్కింది. మార్చి 2న ఈ మైలురాయిని సాధించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జియో..30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తున్నది.

Reliance jio hits 300 million subscribers in 2.5 years.

జియో సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను చేర్చుకొని రికార్డు సృష్టించింది. డిసెంబర్ 2018 త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన నివేదికలో భారతీ ఎయిర్‌టెల్ 28.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ప్రకటించింది. అనగా ఎయిర్‌టెల్ టెలికం సేవలు ప్రారంభించిన 19వ సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నర సంవత్సరాలలో ఈ ఘనతను సాధించడం విశేషం. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.