కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన జియో - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన జియో

October 21, 2019

జియో ఇటీవల ఇతర నెట్‌వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ప్రకటనతో వినియోగదారులు నిరాశకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జియో నెట్‌వర్క్ తన వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కొత్త రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టింది. 

Reliance Jio.

‘జియో ఆల్ ఇన్ వన్’ పేరుతో మొత్తం 3 ప్లాన్లను ప్రకటించింది. నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 చొప్పున ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభిస్తోంది. జియో నుంచి జియో నంబర్లకు కాల్స్ ఉచితం. ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్‌పై 1000 నిమిషాల ఉచిత టాక్ టైమ్ లభిస్తోంది.