జియో కస్టమర్లకు హెచ్చరిక.. ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు - MicTv.in - Telugu News
mictv telugu

జియో కస్టమర్లకు హెచ్చరిక.. ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు

October 9, 2019

Reliance Jio is warning users about this new scam

మనదేశంలో అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ అయిన రిలయన్స్ జియో తన కష్టమర్లను హెచ్చరించింది. జియో కస్టమర్లకు మెస్సేజ్ రూపంలో వచ్చే ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ లింక్‌ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్‌ను క్లిక్ చేస్తే ఫోన్‌లోని వ్యక్తిగత డేటా చోరీ కావడం ఖాయమని హెచ్చరించింది. 

రిలయన్స్ జియో పేరుతో ఓ కొత్త స్కామ్ జరుగుతోంది. దీన్ని గుర్తించిన రిలయన్స్ జియో సంస్థ వెంటనే జాగ్రత్త పడి.. తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. అధికారికంగా ఓ హెచ్చరిక కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా అనేకమంది రిలయన్స్ జియో కస్టమర్లకు ఒక మెస్సేజ్ వస్తోంది. ”Good News!! Jio is giving free 25GB Data Daily for 6 months. Download app and register to activate offer link: **tiny url**”  ఇది ఆ మెస్సేజ్. దీన్ని చూసి చాలామంది నిజమే అనుకుని మెస్సేజ్‌లో వచ్చిన లింక్‌ క్లిక్ చేసి ఘోరంగా మోసపోతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ ప్రమేయం లేకుండానే My Prime అనే apk ఫైల్ ఫోన్‌లోకి డౌన్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత కస్టమర్ డేటా మొత్తం హ్యాక్ అవుతుంది. వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరిపోతుంది. ఉచితంగా మొబైల్ డేటా లభిస్తుందన్న ఆశతో.. చాలామంది లింక్ క్లిక్ చేస్తున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు గూగుల్ ప్లే స్టోర్‌లో రిలయన్స్ జియో యూజర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తాం అనే పేరుతో అనేక నకిలీ అప్లికేషన్లు చలామణి అవుతున్నాయి. నకిలీ అప్లికేషన్లు, నకిలీ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో హెచ్చరించింది.