యూజర్లకు జియో వాతలు ఇలా.. ప్లాన్ల ప్రకటన..  - MicTv.in - Telugu News
mictv telugu

యూజర్లకు జియో వాతలు ఇలా.. ప్లాన్ల ప్రకటన.. 

December 4, 2019

jio new plans

కాల్స్, డేటా.. కారు చవక, ఊర ఉచితం అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో తన యూజర్లక కొత్త కర్రు కాల్చి వాతలు పెట్టింది. సవరించిన ధరలతో కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ నెల 6 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. చాలామంది వాడుతున్న మూడు నెలల ప్లాన్ ధరలను రూ. 555 చేశారు. డైలీ 2జీబీ ధర రూపాయి తక్కువ రూ.600కు పెరిగింది. ఈ కొత్త ప్లాన్లకు  న్యూ ఆల్ ఇన్ వన్ అని నామకరణం చేసింది ముఖేశ్ అంబానీ కంపెనీ. 

వీటిలో అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని, 300 శాతం అదనపు ప్రయోజనాలు ఉంటాయని జియో తెలిపింది. కస్టమర్లకు విశ్వాసపాత్రంగా ఉవంటాయని దేశీయ టెలికం పరిశ్రమ పురోగతికి తమ వంతు కృషి చేస్తామని చెప్పుకొచ్చింది.