జియో పండగ.. రూ. 699కే ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

జియో పండగ.. రూ. 699కే ఫోన్

October 1, 2019

Reliance jio phone Rs.699 festival offer 

దసరా, దీపావళి పండగల సందర్భంగా రిలయన్స్ జియో కంపెనీ ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. ఎలాంటి షరతులూ లేకుండా కేవలం రూ. 699కే జియో ఫోన్ అమ్ముతోంది. దీని అసలు ధర రూ. 1500. దీనికి కోసం పాత ఫోన్ల మార్పిడి వంటి తతంగాల జోలికి పోవాల్సిన అవసరమేదీ ఉండదు.

ఈ ఫోన్ కొంటే తొలి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాకూ ఉచితంగా వస్తుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 మిగిలినట్లే. ఈ ఆఫర్ దీపావళి వరకే ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దివాలి 2019 ఆఫర్ లో చేరాల్సి ఉంటుంది. డిజిటల్ విప్లవం అందరికీ అందుబాటులో ఉండేలా తాము ఈ ఆఫర్ ప్రటిస్తున్నామని జియో తెలిపింది.