Reliance Jio to bring 5G smartphone in india
mictv telugu

జియో 5జీ ఫోన్ ధర ఎంతుండవచ్చో అంచనాలు వచ్చేశాయి

September 27, 2022

 

భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. 4జీ ప్రారంభమైన మొదట్లో 2జీ, 3జీ వినియోగదారులను అకట్టుకోవడానికి ఆరు నెలలు ఉచిత 4జీ సేవలను అందించించి కస్టమర్లను ఆకర్షించింది. అదే క్రమంలో జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందరూ కొనుక్కునేలా దాని ధరను రూ. 4,499గా నిర్ణయించి ప్రజల ఆదరణను చూరగొన్నది. అయితే ఇప్పుడు 5జీ కాలం రావడంతో అదే వరుసలో 5జీ పోన్ తీసుకురానున్నట్టు ఇటీవల వెల్లడించింది. దాంతో ధర ఎంతుండవచ్చనే ఆసక్తి నెలకొంది. లేటెస్ట్‌గా వస్తున్న జియో 5జీ ఫోన్‌ను గూగుల్‌తో కలిసి తయారు చేస్తుండగా, ధర అంచనాను కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా రూ. 8 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఫోన్‌లో వాడే పరికరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు వెల్లడించింది. ప్రస్తుతం 4జీలో ఉన్న వినియోగదారులను భారీ ఎత్తున 5జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా జియో ఫోన్ రానున్నట్టు తెలిపింది. కాగా, వచ్చే నెల 1 వ తేదీ నుంచి దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో నెట్ వర్క్ విస్తరించిన తర్వాత ఫోన్ లాంఛ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అటు 4జీతో పోలిస్తే 5జీ సేవల ధరలు 20 శాతం అధికంగా ఉంటాయని ఓ అంచనా.
2జీ, 3జీ కస్టమర్లను 4జీకి మార్చడానికి తక్కువ ధరలో జియో ఫోన్ తెచ్చిన రిలయన్స్.. ఇప్పుడు 4జీ నుంచి కస్టమర్లను తరలించడానికి 5జీ ఫోన్లను తయారు చేస్తోంది,