నేడు 'రిలయన్స్ ఏజీఎం'.. సంచలనాలకు అవకాశం! - MicTv.in - Telugu News
mictv telugu

నేడు ‘రిలయన్స్ ఏజీఎం’.. సంచలనాలకు అవకాశం!

August 12, 2019

Reliance JioGigaFiber, JioPhone 3 set for launch at RIL AGM 2019..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈరోజు సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశంలో గిగా ఫైబర్ సర్వీస్ వాణిజ్య సేవలను ప్రారంభించే అవకాశముంది. కంపెనీ ఈ సేవలను గత ఏడాది వార్షిక సమావేశంలోనే ప్రకటించింది. ఇప్పటిదాకా ట్రయల్స్ నడిచాయి. 

ఇప్పుడు ఈ సేవలు పూర్తిస్థాయిలో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది. రిలయన్స్ జియో గిగా ఫైబర్ అనేది ఒక కాంబో సర్వీస్. బ్రాండ్‌బ్యాండ్, టీవీ కనెక్షన్, ల్యాండ్‌లైన్ అనే మూడు రకాల సేవలు పొందొచ్చు. జియో గిగాఫైబర్ సేవల కోసం కస్టమర్లు రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ ఈ డబ్బును తరువాత వెనక్కు ఇచ్చేస్తుంది. కేవలం గిగాఫైబర్ సర్వీస్‌తోపాటు రిలయన్స్ జియో ఫోన్ 3ని కూడా ఆవిష్కరించే అవకాశముంది. 11 గంటకు ఈ సమావేశం ప్రారంభమౌతుంది. దీన్ని యూట్యూబ్‌‌లో ‘ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్’, జియో ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చు.