భారత్‌లో తొలి కరోనా ఆస్పత్రి ఇదే (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో తొలి కరోనా ఆస్పత్రి ఇదే (వీడియో)

March 24, 2020

reliance Sets Up India's First Dedicated Coronavirus Hospital In Mumbai

దేశంలో కరోనా కేసులు చెలరేగుతున్నాయి. వ్యాధిగ్రస్తుల సంఖ్య 500కు చేరవువుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 101 కేసులు నమోదయ్యాయి. కేరళ, హరియాణాల్లోనూ పరిస్థితి విషమిస్తోంది. లాక్ డౌన్ చేసినా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూనే ఉంది. కరోనాపై పోరులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లక్ష్యంతో రంగంలోకి దిగింది. రోగులను తరలించే వాహనాలకు ఉచిత ఇంధనం, పేదలకు ఉచిత ఆహారం ఇస్తామని ప్రకటించిన కంపెనీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

దేశంలోనే తొలి కరోనా ఆస్పత్రిని రిలయన్స్ ఏర్పాటు చేసింది. వైరస్ కేసులుగా ఎక్కువగా నమోదైన మహారాష్ట్ర ప్రజల కోసం ముంబైలో దీన్ని నెలకొల్పారు. ‘సెవెన్ హిల్స్ ఆస్పత్రి ప్రాంగణంలో సర్ హెచ్‌ఎన్ రిలయ్స్ ఫౌండేషన్ హాస్పిటల్ పేరుతో స్థాపించిన ఈ ఆస్పత్రి నిర్మానికి ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సహకారం అందించింది. ఇందులో 100 పడకలు ఉన్నాయి. కరోనా పాటిజివ్ రోగులను ఇక్కడ క్వారంటైన్ చేస్తారు. ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కరోనాపై పోరాటం కోసం రిలయన్స్ ఇప్పటికే సీఎం సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది.