జియో మీట్..వీడియో కాన్ఫరెన్స్ యాప్ షురూ
లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులందరూ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. దీంతో మీటింగ్ లు పెట్టుకోవడానికి వీడియో కాలింగ్ అప్లికేషన్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వీడియో కాలింగ్ అప్లికేషన్ లకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే వీడియో కాలింగ్ లో జూమ్, గూగుల్ హ్యాంగ్ అవుట్ అప్లికేషన్ లు దూసుకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం 'జియో మీట్' అనే అప్లికేషన్ ను ఆవిష్కరించడానికి సిద్దమైంది. త్వరలో ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ ఓఎస్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ను వినియోగించేందుకు కేవలం ఫోన్ నంబర్‌తో లాగిన్ అయితే సరిపోతుందని తెలుస్తుంది. ఉచిత ప్లాన్‌లో ఐదుగురు వినియోగదారులు, బిజినెస్ ప్లాన్‌లో 100 మంది వినియోగదారులు జియో మీట్ పాల్గొనే వీలుంటుందని సమాచారం.