బిగ్‌బాస్ నిర్వాహకులకు అరెస్ట్ నుంచి ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

బిగ్‌బాస్ నిర్వాహకులకు అరెస్ట్ నుంచి ఊరట

July 17, 2019

Relief for bigboss organisers in high court ...

ప్రారంభం కాకముందే కాక రేపుతున్ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 నిర్వాహకులకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఎంపిక సమయంలో పార్టిసిపెంట్లతో అసభ్యంగా మాట్లాడారని, ఇతర అనైతిక కోరికలు కోరారని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిని కొట్టేయాలన్న నిర్వాహ‌కుల క్వాష్‌ పిటిష‌న్‌పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ కేసుల‌పై పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసులు, పిటిష‌న‌ర్లను ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల‌కు స్పష్టం చేస్తూ విచారణను నెల 24కు వాయిదా వేసింది. `బిగ్‌బాస్ 3` ఈ నెల 21న మొదలు కానుంది. ఎంపిక తీరు బాగాలేదని, షో అనైతికంగా సాగనుందని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాలు ఆరోపించారు.