దుర్గమ్మ పున్నమి ఘాట్‌లో మతమార్పిళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గమ్మ పున్నమి ఘాట్‌లో మతమార్పిళ్లు

December 3, 2019

Vijayawada

తిరుమల వెబ్‌సైట్‌లో అన్యమత ప్రచారం జరుగుతోందనే వివాదం సద్దుమణుగక ముందే విజయవాడ కనక దుర్గ ఆలయం వద్ద మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయానికి సమీపంలోనే మత మార్పిడులు కలకలం రేపాయి. కృష్ణా నదిలో పున్నమి ఘాట్ వద్ద స్నానాలు చేయించిన పాస్టర్లు పెద్ద ఎత్తున మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు.పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మత ప్రచారం చేసుకుంటూ 47 మందిని మతం మార్పించారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఇతర మతాల వారు ప్రచారం చేసుకోవడం, మార్పిడులకు పాల్పడటం నిషేదం ఉన్నా పాస్టర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి ఆలయం వద్ద ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు, పున్నమి రిసార్ట్స్ గేట్‌కు మేరీమాత విగ్రహాన్ని కూడా తగిలించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల సింహాద్రి కొండపైకి వెళ్లే బస్సులకు ఇతర మతాల ప్రచార పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో వివాదం తలెత్తింది. వెంటనే ఆ బస్సులను కొండపైకి వెళ్లకుండా అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కనక దుర్గ ఆలయానికి అతి సమీపంలో మత మార్పిడులు జరగడం వివాదానికి దారి తీశాయి.