ఏపీలో రేషన్ కార్డులపై మత ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రేషన్ కార్డులపై మత ప్రచారం

December 7, 2019

Religious campaign on ration cards in Andhra Pradesh vadlamur  

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మతప్రచార కలకరం రేగింది. రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని ఓ చవక ధరల దుకాణం యజమాని వీటిని అచ్చేయించారు. క్రీస్తు చిత్రంతోపాటు వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని కూడా కార్డులపై ముద్రించారు. 

జనం నిత్యం వాడే అంత్యోదయ కార్డులపై ఇలా మతాల ప్రచారం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే క్రైస్తవ మతప్రచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వానికి ఈ కార్డులు తలనొప్పిగా మారాయి. పంచాయతీ ఆఫీసులకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, శ్మశానాలు, గుళ్లకు వైకాపా రంగులు పూయడం ఇప్పటికే వివాదాస్పమైన సంగతి తెలిసిందే.