ఇరాన్, చైనా, రష్యాలలో మత స్వాతంత్ర్యం ఆపదలో ఉందంటోంది అమెరికా. ఈ దేశాల్లో జరిగిన తాజా గొడవలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఓ రిపోర్ట్ లో తెలిపింది. ప్రజలపై జరుగుతున్న దాడులు మత స్వాతంత్రాన్ని కాలరాస్తున్నాయని, రూల్స్ ని అతిక్రమిస్తున్నాయని పేర్కొన్నారు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అటార్ని బ్లింకిన్. ఈ మూడు దేశాలతో పాటూ నార్త్ కొరియా, మయన్మార్ దేశాల్లో కూడా పరిస్థితులు ఏం బాలేవని చెప్పారు. ఇంకా అల్గేరియా, వియత్నాం లాంటి దేశఠాల మీద కూడా దృష్టి పెట్టామని, అవి కూడా తమ వాచ్ లిస్ట్ లో ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇక సిరియాలో క్రెమ్లిన్ అలైన్డ్ వాగనర్ గ్రూప్‌తో పాటూ చాలా గ్రూప్ లు యాక్టివ్ గా ఉన్నాయిని…ఇవి ఆఫ్రికా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నయాని బ్లింకిన్ అన్నారు. సిరియాలో జరుగుతున్న గొడవలకు ఈ గ్రూప్ లే కారణమని అన్నారు.మత పరంగా జరుగుతున్న గొడవలకు కానీ, అక్రమాలకు కానీ అమెరికా సపోర్ట్ ఇవ్వదని స్పష్టం చేశారు.
గొడవలు జరుగుతున్న అన్ని దేశాలతో యూఎస్ గవర్నమెంట్ మీట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని బ్లింకిన్ తెలిపారు. ఇరాన్ మీద ప్రెజర్ తెస్తున్నామని, అక్కడ గొడవలు ఆపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇరాన్ లో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఇప్పటివరకు 300 మంది చనిపోగా, 14వేలమందిని అరెస్ట్ చేశామని తెలిపారు.సెప్టెంబర్ లో కుర్దిష్ వుమన్ మాషా అమినిని చంపేశాక ఈ గొడవలు మొదలయ్యాయని అన్నారు. ముస్లిం దేశాలలో ప్రజల మీద ఒత్తిడి, ఆంక్షలు ఎత్తేయాలని….డ్రెస్ ల వంటి విషయాల్లో వాళ్ళ ఫండ్ మెంటల్ రైట్స్ ను గౌరవించాలని అమెరికా ప్రభుత్వం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ దిశగా అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని, తమ దేశం దానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని బ్లింకిన్ తెలిపారు.