పాక్‌‌లో పేలుడు.. ఏడుగురు మృతి, 70 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్‌‌లో పేలుడు.. ఏడుగురు మృతి, 70 మందికి గాయాలు

October 27, 2020

ngngnf

వరుస పేలుళ్లతో దాయాది పాకిస్తాన్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల జరిగిన పేలుడును మరువకముందే ఈరోజు పెషావర్‌లో మరో పేలుడు సంబంధించింది. ఓ మతతత్వ స్కూల్‌లో జరిగిన ఈ పేలుడులో ఏడుగురు మృతిచెందగా.. 70 మంది గాయపడ్డారు. 

‘ఈ పేలుడులో ఐఈడీ ఉపయోగం జరిగింది. పాఠశాలలో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. ఎవరో ఓ వ్యక్తి బ్యాగ్‌తో శిక్షణాలయంలోకి వచ్చాడు. గాయపడ్డవారిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారు. దాదాపు అయిదు కిలోల పేలుడు పదార్దాలు వాడారు.’ అని పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు.