remedies for respiratory problems in winter
mictv telugu

అమ్మో చలి, ఆపైన శ్వాస సంబంధిత సమస్యలు

December 21, 2022

remedies for respiratory problems in winter

అమ్మో చలి.. రెండు నెలలుగా రాష్ట్రంలో వినిపిస్తోన్న మాటలు.. చలి అంటేనే జనాలు హడలిపోతున్నారు. ఒకపక్కన చలికాలం మరోవైపు వర్షాలు దానికి తోడు గాలులు కలిపి అందరూ గజగజలాడిపోతున్నారు. వైరస్ లు విజృంభిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనేది లేకుండా చాలామంది మంచాన పడుతున్నారు.ఈ చల్లటి గాలులు చంపేస్తున్న వేళ శ్వాస రుగ్మతలు కూడా పెరిగిపోయాయి. అందులోని శ్వాసకు సంబంధించిన ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్ళ పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. ఇటువంటి టైమ్ లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందులోనూ మళ్ళీ కరోనా వ్యప్తి చెందే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. మరి దీని కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దామా.

జాగ్రత్తలు:

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటి దగ్గర రుమాలు పెట్టుకోవాలి.

తుమ్మిన, దగ్గిన తర్వాత వెంటనే చేతులు కడుక్కోవాలి.

జలుబు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడమే మంచింది.

పిల్లలని అయితే స్కూలుకు పంపించకపోవడమే మేలు

అందరూ ఒకే వస్తువులు వాడకుండా ఎవరికి వారు వేరు వేరుగా టవల్స్, కర్చీఫ్ లు వాడడం ఉత్తమం.

వేడినీటితో ఆవిరి పట్టాలి.

చల్లని పదార్ధాలు, చల్లని నీళ్ళు, కూల్ డ్రింకులు లాంటివి తీసుకోకూడదు.

అప్పుడే వండిన వేడివేడి పదార్ధాలను, ఆహారాన్ని తినాలి

డాక్టర్లను సంప్రదించకుండా ముందులు వాడకూడదు.

చలికాలంలో చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్లకూడదు. తప్పకుండా వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఉన్ని వస్త్రాలను ధరించండి. తల మీద మంచు పడకుండా ఏదైనా వస్త్రం లేదా క్యాప్ ధరించండి. తీవ్రమైన చలిలో శరీరంపై వస్త్రాలు లేకుండా తిరగడం చాలా డేంజర్. తప్పకుండా ఉన్ని వస్త్రాలు ధరించాలి. చెవులు, ముక్కు కవర్ చేసుకోవాలి. చలిగాలి తీవ్రత ఎక్కువగా ముఖం, చేతులు, పెదవులు, పాదాల మీద ప్రభావం చూపుతుంది. చర్మం పొడిబారి దురద వస్తుంది. ముఖం మీద చెమట పొక్కులు, పెదాలకు పగుళ్లు ఏర్పడతాయి. ముఖం బిగిసిపోయినట్లు అనిపిస్తుంది.

ఇంటి చిట్కాలు:

ఇస్నోఫీలియా, ఆస్తమా వంటి లక్షణాలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మామూలు వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తే మంచింది. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాదు జలుబు, దగ్గుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు కూడా.

పసుపు పాలు.. పసుపు పాలు శ్వాసకోశ సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది. పసుపు పాలలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

అల్లం.. శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేసే గుణం అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చలికాలంలో లేదా వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం డికాక్షన్ తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలపడుతుంది.

మూలికల టీ.. వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి హెర్బల్ టీ బెటర్ అని చెప్పొచ్చు. ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా దాల్చినచెక్క, అల్లం, తేనె, నిమ్మకాయలతో తయారుచేసిన టీ ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైనది.

తేనె.. శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడేందుకు తేనెను అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. వర్షాకాలంలో, చలికాలంలో తేనె, ఎండుమిర్చి కలిపి తీసుకుంటే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాస సమస్యలను కూడా దూరం చేస్తుంది.

సమస్యలు వస్తే పాటించాల్సినవి:

మామూలుగానే జలుబు, దగ్గు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోని చలికాలంలో ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇలాంటివి చాలా మందికి ఎదురయ్యే సమస్యలు. శ్వాస సమస్య వచ్చినప్పుడు సరిపడినంతగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. నొప్పిగా ఉంటుంది. పిల్లలకు ముక్కు మూసుకుపోతుంది. పెద్దవాళ్ళ గురించి అయితే చెప్పనే అక్కరలేదు. అలాంటప్పుడు ఇంట్లోనే తయారు చేసుకునే కషాయంతో రిలీఫ్ పొందవచ్చును. ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకునే దీనివల్ల చాలా తొందరగా ఉపశమయం కలగడమే కాకుండా ఎక్కువసేపు దాని ప్రభావం కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్లను సంప్రదించడమే ఎప్పుడూ మంచిది. డాక్టర్ ని కలిసాక ఒకవైపు మందులు వాడుతూ కూడా ఈ కషాయాన్ని అయితే తాగవచ్చును.

ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ వాము, 10 పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరుగుతున్నప్పుడు పొయ్యి మీద నుంచి దించాలి, ఆ తర్వాత ఆవిరిని కొంతసేపు ముక్కుతో, కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు వచ్చేస్తుంది. జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తొలగిపోతుంది. అస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.