Remoteless and wireless TV has entered the market
mictv telugu

మార్కెట్లో కొత్త విప్లవం.. రిమోట్, వైర్లు, బోల్టులు లేని టీవీ ఎంట్రీ

January 6, 2023

ఇప్పటివరకు అత్యాధునిక టీవీ అంటే గోడకు తగిలించే ఎల్ఈడీనే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి నట్లు, బోల్టులు, రిమోట్, కేబుల్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ వంటివి అవసరం పడతాయి. కానీ దీని బాబులాంటి టీవీ కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ టీవీకి రిమోట్, విద్యుత్ కేబుల్ కనెక్షన్లు, నట్లు, బోల్టులు వంటివి ఏవీ అవసరం లేదు. కనీసం గోడకు తగిలించడానికి మేకులు కూడా అవసరం లేదు. సులభంగా గోడకైనా, గ్లాస్ కైనా, చివరికి తలుపులు, కిటికీలకైనా దీన్ని అతికించేయవచ్చు. ది డిస్ ప్లేస్ టీవీ అని పిలిచే ఈ కొత్త రకం టీవీని లాస్ వెగాస్ లోని కన్య్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించారు. టీవీ వెనుక ఉండే వ్యాక్యూమ్ తో గోడ, గ్లాస్ లేదా కిటికీకైనా ఇది అతుక్కుపోతుంది.
రోజుకు కనీసం ఆరు గంటలు టీవీ చూసినా నెల రోజులకు వచ్చేలా ప్రత్యేకమైన బ్యాటరీలు అమర్చారు. 20 పౌండ్ల కంటే తక్కువ బరువున్న దీని ధర 3000 డాలర్లు. మన కరెన్సీలో రెండున్నర లక్షలు. ఇక రిమోట్ అవసరం లేకుండా ప్రత్యేక టెక్నాలజీని వాడారు. కేవలం మన చేతులతో ఛానెల్ మార్చడం, జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అర చేతిని పట్టుకోవడం ద్వారా వీడియోను పాజ్ చేయవచ్చు. ఇందుకోసం టీవీ పైన ప్రత్యేకమైన కెమెరా అమర్చబడి ఉంటుంది. దీంతో వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రీఆర్డర్ కోసం కేవలం 100 యూనిట్లు మాత్రమే తయారు చేశామని డిసెంబర్ నుంచి షిప్పింగ్ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.