యూపీలో 64 వేల లౌడ్ స్పీకర్లు తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో 64 వేల లౌడ్ స్పీకర్లు తొలగింపు

May 9, 2022

ఉత్తరప్రదేశ్‌లో రెండు వారాల్లోనే భిన్న మతలకు చెందిన ప్రార్థనా స్థలాల నుంచి అనుమతుల్లేని 64,128 లౌడ్ స్పీకర్లను అధికారులు తొలగించారు. మరో 57,352 లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్‌ను తగ్గించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..లౌడ్ స్పీకర్లకు సంబంధించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతి, సామరస్యతను కాపాడతామని, కార్యక్రమాల నిర్వాహకుల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. దాంతో పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. అత్యధికంగా బరేలీ ప్రాంతం నుంచి 17,287 లౌడ్ స్పీకర్లు తొలగించారు. ఆ తర్వాత మీరట్ నుంచి 11,769 లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.

మరోపక్క ఇటీవలే అలహాబాద్ హైకోర్టు లౌడ్ స్పీకర్ల విషయంలో కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడం ప్రాథమిక హక్కేం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ ప్రకారమే యోగి ఆదిత్యనాథ్..ఆదేశాలు ఇచ్చినట్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ యూపీ వ్యాప్తంగా జరుగుతుందని, అనుమతి లేని లౌడ్ స్పీకర్లను తొలగిస్తామని అన్నారు.