ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీపై గాంధీ బొమ్మ లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ అరుణ్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘కొత్తగా తెచ్చిన డిజిటల్ కరెన్సీపై గాంధీ బొమ్మ వేయనందుకు ప్రభుత్వానికి, ఆర్బీఐకి ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన బొమ్మను పేపర్ కరెన్సీపై కూడా తీసేయండి’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు తుషార్ గాంధీకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. ‘నోట్లపై ఒక్క గాంధీ ఫోటోనే ఎందుకుండాలి సార్. ఆ మాటకొస్తే కరెన్సీ నోట్లు, కాయిన్లపై అందరు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు వేయాల్సిందే’నని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కాగా, పేపర్ కరెన్సీ వినియోగానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ కరెన్సీని సీబీడీసీ (ఈ – రూపీ) పేరుతో ఆర్బీఐ తీసుకొచ్చింది. దీన్ని రిటైల్, హోల్ సేల్ లావాదేవీలకు వినియోగిస్తూ ప్రయోగాత్మకంగా కొన్ని పట్టణాల్లో వినియోగిస్తున్నారు. దీన్ని ఇంకా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీనివల్ల కరెన్సీ వ్యయాలు ఆదా అవడంతో పాటు నగదు నిర్వహణ రూపంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం చలామణిలీ ఉన్న అన్ని రకాల డినామినేషన్లలో ఈ – రూపీ వస్తుంది. ఈ రూపీ వచ్చినా భౌతిక కరెన్సీ నోట్లు కూడా చలామణీలో ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
బీఆర్ఎస్ లెక్క తేలింది.. 5 రెట్లు పెరిగిన ఆదాయం