ప్రియాంక పదవి పీకేయండి..ఐరాసకు పాక్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక పదవి పీకేయండి..ఐరాసకు పాక్ లేఖ

August 21, 2019

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ..‘భారత్ వాయుసేన పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్న మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి?’ అని నిలదీసింది. దీంతో ప్రియాంక స్పందిస్తూ..’పాకిస్తాన్‌లో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో… నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు’ అని కౌంటర్ ఇచ్చింది. 

ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్‌కు లేఖ రాస్తూ..‘జమ్మూకశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు’ అని పేర్కొంది.