శృంగారం మధ్యలో కండోమ్ తీసేస్తే 7 ఏళ్ల జైలు - MicTv.in - Telugu News
mictv telugu

శృంగారం మధ్యలో కండోమ్ తీసేస్తే 7 ఏళ్ల జైలు

October 15, 2018

మీటూ ఉద్యమం అలజడి రేపుతోంది. సెలబ్రిటీల బండారాన్ని బయటపడుతోంది. కేంద్ర మంత్రి ఎంకే అక్బర్ నుంచి సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వరకు.. ఎందరో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం పేరుతో, అవకాశాలతో పేరుతో తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. మరోపక్క.. మీటూ ఉద్యమంతో మరో రకం బాధితులు కూడా నెమ్మదిగా బయటికొస్తున్నారు.

తాము పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, అయితే మగవాళ్లు తమను దాగా చేసి, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలవైపు నెట్టారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసి(స్టెల్తింగ్) తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారని ఆరోపిస్తున్నారు. పైకి ఇది తేలికపాటి వ్యవహారంగా కనిపించినా సదరు పురుషుడికి సుఖవ్యాధులు ఉంటే తమకు కూడా సోకుతాయని, అలాంటి వారిని కూడా శిక్షించాలని కోరుతున్నారు.

Removing condom in the middle of sex amounts to rape Stealthing cases increased victims raises their voice against this immoral, unethical rogue culture

శ్రేయ అనే జర్నలిస్టు తన అనుభవాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు కూడా. ‘స్టెల్తింగ్ వల్ల నా హక్కులు దెబ్బతింటాయి. గర్భం రావొచ్చు. సుఖవ్యాధులు సోకవచ్చు. గర్భస్రావం కూడా జరగొచ్చు. నా ప్రాణమే పోవచ్చు. ఇది చట్టరీత్యా అత్యాచారంతో సమానం..’ అన్నారు. ఒక ఐటీ ఉద్యోగిని కూడా తన చేదు అనుభవాన్ని పంచుకుంది. ‘బాయ్ ఫ్రెండుతో కలసి సెక్స్‌లో పాల్గొన్నాను. అతడు మధ్యలో కండోమ్ తీసేశాడు. నేను షాక్ తిన్నాను. వెంటనే బాత్రూంలోకి పరిగెత్తి శుభ్రం చేసుకున్నాను.. కానీ ఫలితం లేకపోయింది. గర్భం దాల్చాను. అతనికి విషయం చెబితే పట్టించుకోలేదు… ’ అని ఆవేదన వ్యక్తం చేసింది.  

స్టెల్తింగ్.. అత్యాచారంతో సమానం..

స్టెల్తింగ్‌ను చాలా దేశాల్లో అత్యాచారంగా పరిగణిస్తున్నారు. మనదేశంలో అత్యాచార నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. స్టెల్తింగ్ జరిగినట్లు బాధితులు నిరూపించగలిగితే ఏడేళ్ల జైలు శిక్షపడుతుంది.  కేసు తీవ్రతను బట్టి అంతకంటే ఎక్కువ శిక్ష కూడా పడే అవకాశముందని న్యాయనిఫులు చెబుతున్నారు.