టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఆయన నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సక్సెస్‌ని ప్రస్తుతం విశ్వక్ సేన్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు విద్యాసాగర్ దర్శకత్వం వహించగా, సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు నిర్మించారు. సినిమా విడుదలకు ముందు విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో వల్ల పలు వివాదాల్లో ఆయన చిక్కుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇటు ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో విశ్వక్ సేన్‌కు సపోర్ట్ చేస్తూ, పలువురు హీరోలు, నెటిజన్స్ విశ్వక్సేన్కు అండగా నిలిచారు.
ఈ క్రమంలో మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా భారీ విజయాన్ని సాధించి, మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత విశ్వక్సేన్ ప్రస్తుతం నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు ముందు వరకు రూ. 1.5-2 కోట్ల వరకు పారితోషికం తీసుకునే వాడట. ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్ కోసం విశ్వక్ దగ్గరికి వెళ్తే, తన రెమ్యునరేషన్ ఇప్పుడు రూ. 3 కోట్లకు పెంచేయడంతో నిర్మాతలకు ఒక్కసారిగా షాక్ అవుతున్నారట. అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఓ టాక్ గట్టిగా వినిపిస్తుంది.