తెలంగాణ పోలీసులకు టోపీ.. 16 ఏళ్లుగా ఫేక్ పోలీస్.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పోలీసులకు టోపీ.. 16 ఏళ్లుగా ఫేక్ పోలీస్..

February 24, 2020

Renamed and got a police job.. The 16-year-old was caught

సినిమాల్లో, సీరియళ్లలో, చివరికి సోషల్ మీడియాలో పేర్లు మార్చుకోగా చూశాం. అసలు పేరు కలిసి రావడంలేదని పెట్టుకున్న పేరుతో వారు ఫేమ్ సంపాదిస్తారు. కానీ, ఒకతను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం కోసం పేరు మార్చుకున్నాడు. మార్చుకున్న పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పొందాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఉద్యోగాన్ని గత 16 ఏళ్లుగా నెట్టుకువస్తున్నాడు. ఇంతకీ అతను చేసిన ఉద్యోగం ఏంటి అనుకుంటున్నారూ? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. ఈ దగా హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది. 

సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అశోక్ రెడ్డి పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి 2004 పోలీస్ రిక్రూట్మెంట్ సెలక్షన్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుంచి పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఎంక్వైరీ చేసి ఈ రోజు సుధాకర్ రెడ్డి అలియాస్ అశోక్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.