పేరు మార్చుకున్న వాల్మీకి.. ఇకపై ‘గద్దలకొండ గణేష్‌’గా - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న వాల్మీకి.. ఇకపై ‘గద్దలకొండ గణేష్‌’గా

September 19, 2019

Renamed Valmiki movie.. From now on Gaddalakonda Ganesh

‘వాల్మీకి’ సినిమా పేరును మారుస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్‌’గా మార్చింది. చిత్రంలో ‘గద్దల కొండ గణేష్‌’గా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్‌ కనిపించనున్నాడు. ఇప్పుడు అదే పేరును చిత్రానికి పెట్టారు. శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతున్న ‘వాల్మీకి’ సినిమా పేరును మార్చాలంటూ గత కొద్ది రోజులుగా బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారిస్తున్న న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు పపించింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా చిత్రం పేరు మారుస్తున్నట్లు కోర్టుకు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. వాల్మీకి పేరును ‘గద్దలకొండ గణేష్‌’ గా మారుస్తామని పేర్కొంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. నితిన్ ఓ పాత్రలో మెరుస్తున్నాడు. మరో కీలక పాత్ర తమిళ నటుడు అధర్వ పోషిస్తున్నారు. ఇదిలావుండగా టైటిల్ వివాదం నేపథ్యంలో అనంతపురం, కర్నూలు రెండు జిల్లాల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. పేరు మార్చుకున్నాక సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇస్తారో లేదో చూడాలి.