Rental prices in Hyderabad
mictv telugu

హైదరాబాద్‌లో భగ్గుమంటున్న అద్దె ధరలు..

August 6, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అద్దె ఇళ్ల ధరలు భగ్గమంటున్నాయి. దేశవ్యాప్తంగా బెంగుళూరు, గ్రేటర్ నోయిడా తర్వాత హైదరాబాద్‌లోనే అద్దెంటి ధరలు ఎక్కువగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ ఆన్లైన్ పోర్టళ్లు తెలిపాయి. దీనికి కారణం కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలపాటు ఆర్థికంగా దెబ్బతియటం వల్లే ఇంటి యాజమానులు అద్దె ధరలను అమాంతంగా పెంచేశారని పేర్కొన్నాయి.

తాజాగా రెంటల్ ఇండెక్స్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం…”దేశంలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే అద్దెలు పెరిగాయి. ఐటీ ఉద్యోగులు పని ప్రదేశానికి సమీపంలో ఉండేందుకు బాగా ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా ఆ కారిడార్ చుట్టుపక్కలే అద్దెలకూ భారీగా డిమాండ్ పెరిగింది.

దీంతో హైటెక్ సిటీలో రెండు పడక గదుల ఇంటికి రూ.20 వేలు, మూడు పడక గదులైతే 30వేలు, గచ్చిబౌలిలో రూ. 30 వేల నుంచి రూ.20 వేలు, కొండాపూర్‌లో రూ.17 వేల నుంచి రూ. 24వేల వరకు అద్దె తీసుకుంటున్నారు. ఇక, కోకాపేటలో రూ. 10 వేల నుంచి రూ. 25 వేలు, మణికొండ, నార్సింగి, నల్లగండ్ల, కూకట్‌పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎక్కువ మంది విశాలమైన ఇళ్లవైపే మొగ్గుచూపుతున్నారు.

ఇక, చివరగా హైదబాద్‌లో చిరువ్యాపారాలు చేసేవారి దగ్గర నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు ఉండే అద్దెల విషయానికొస్తే..రూ. 10 వేల నుంచి 20 వేల మధ్య ఇళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీరి వాటా 35శాతం. సరఫరా 19 శాతం. రూ.20 వేలు-రూ.30 వేల మధ్య ఇంటి కోసం చూస్తున్నవారు 25 శాతంగా ఉన్నారు. సరఫరా 45 శాతం. రూ.30 వేల నుంచి రూ. 40 వేల మధ్య గృహాలకు 16 శాతం, రూ.40 వేలు-రూ.50 వేల మధ్య వాటికి 8 శాతం డిమాండ్ ఉంది. ఇళ్ల లభ్యత 18 శాతం, 8 శాతం ఉంది” అని రెంటల్ ఇండెక్స్‌లో వివరాలను వెల్లడించారు.