renu desai condemned pawan kalyan comments on alimony
mictv telugu

నాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు.. పవన్ కళ్యాణ్‌పై రేణు వ్యాఖ్యలు వైరల్

October 20, 2022

పవన్ కళ్యాణ్ అనగానే మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శలతో విరుచుకుపడతారు ఆయన ప్రత్యర్థులు. ప్యాకేజి స్టార్, పొలిటికల్ గెస్ట్.. ఇలా తనపై వచ్చే విమర్శలకు పవన్ కౌంటర్ ఇస్తూ వస్తున్నా.. మూడు పెళ్లిళ్లపై మాత్రం ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు పవన్. ‘ఎవరి జీవితాలు వారివి.. నా లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఎదురైతే నేను మూడు పెళ్లిళ్లు చేసుకుని ఉంటాను’ అని ఎమోషనల్ టచ్ ఇచ్చాడే కానీ గట్టి కౌంటర్ మాత్రం పవన్ తన ప్రత్యర్థులకు ఇవ్వలేదు. అయితే మొన్న మంగళగిరిలో మాత్రం అందరి మాడు పగిలేలా తన మూడు పెళ్లిళ్లపై రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ‘మరోసారి నా పెళ్లిళ్లపై మాట్లాడితే చెప్పుతో కొడతా.. ఎదవల్లారా.. సన్నాస్సులారా.. కొడకల్లారా, పీక పిసికేస్తా..’ అంటూ బూతు పురాణం ఎత్తుకున్నాడు. అయితే అదే సందర్భంలో తన భార్యలని ఊరికే వదిలేయలేదని.. చట్టబద్ధంగా విడాకులు ఇచ్చానని చెప్పాడు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన మాజీ భార్యలకు ఇచ్చిన భరణంపై స్పందించారు. మొదటి భార్యకి ఐదు కోట్లు ఇచ్చాను. రెండవ భార్యకి ఆస్తి రాసిచ్చాను అంటూ కామెంట్స్ చేశాడు పవన్.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. రేణు గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చాడా అని రేణుదేశాయ్‌ని ప్రశ్నిస్తే.. నాకు చిల్లిగవ్వ కూడా పవన్ కళ్యాణ్ భరణం ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా రోజుల క్రితమే భరణంపై రేణు కామెంట్స్ పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. మరి ఒకవైపేమో రేణు భరణం తీసుకోలేదు అంటుంటే.. పవన్ కళ్యణ్ ఏమో ఇచ్చానని అంటున్నాడు. ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అంటూ చర్చిస్తున్నారు నెటిజన్స్. ‘నా జీవిత మనుడగ కోసం ఒంటరిగానే పోరాడుతున్నాను. నేనిప్పటివరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం’ అంటూ అప్పట్లో రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ ఇంకా సోషల్ మీడియాలోనే ఉంది. ఆ రేణు దేశాయ్ పోస్టుని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వర్గం వైరల్ చేస్తుంది. అయినా రేణు ఆ పోస్టుని ఇప్పటివరకు డిలీట్ చేయకపోవటం గమనార్హం.