renu desai instagram post about companionship is gone Viral
mictv telugu

చేయి పట్టుకొని నడిపించే తోడు కావాలి.. రేణు దేశాయ్

September 5, 2022

హీరో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయినా.. వారి పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పిల్లలు అకీరా, ఆద్య లు రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నారు. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్నారు. చాలా రోజుల క్రితం రేణు దేశాయ్ రెండో వివాహం గురించి వార్తలు వచ్చాయి. 2013లో పవన్ తో విడాకులు తర్వాత.. జీవితంలో తోడు అవసరం అని రేణు దేశాయ్ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. ఆ తర్వాత 2018లో రేణుదేశాయ్ కి ఒక బిజినెస్ మెన్‌తో నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే రేణు దేశాయ్ రెండవ వివాహం సీక్రెట్ గా జరిగిందనే ప్రచారం కూడా ఉంది. కానీ దీని గురించి అధికారిక సమాచారం లేదు.

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

తాజాగా.. రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరలవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ”జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి” అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. అంతే కాకుండా మరో పోస్ట్‌లో ”మీ సోల్ మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి” అంటూ కామెంట్ పెట్టింది. చాలా రోజుల తర్వాత ఆమె ఇలాంటి పోస్ట్‌లు పెట్టడంతో మరో సారి రెండో పెళ్లి వార్తా పట్టాలెక్కింది. మరి రేణు నిజంగానే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో ఉందేమో తెలియాల్సి ఉంది.