పవన్ కల్యాణ్ రెండో భార్యగా సుపరిచితురాలైన రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తనకున్న అనారోగ్యాన్ని వెల్లడించారు. గత కొన్నాళ్లుగా గుండె, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నానని, తనను సన్నిహితంగా చూస్తున్న వాళ్లకి ఈ విషయం తెలుసని తెలిపారు. తనలా ఎవరైనా బాధపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దని సూచించించారు. అలాంటి వారిలో పాజిటివ్ ఎనర్జీ, ధైర్యాన్ని నింపాలని కోరారు. ‘ఏదో ఒకరోజు మన కృషికి తగ్గ రిజల్ట్ వస్తుంది. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ప్రస్తుతం నేను చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటూ యోగా చేస్తున్నాను. తొందర్లోనే అనారోగ్యం నుంచి కోలుకొని షూటింగుకి హాజరవుతాను’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో గెట్ వెల్ సూన్, ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే సమంత మయోసైటిస్, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలా పేరున్న నటీమణులు వరుసగా వ్యాధుల బారిన పడుతుండడంతో వాళ్ల అభిమానుల ఆందోళన చెందుతున్నారు.