రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ

September 20, 2020

xmfbfn

నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. 2003లో వచ్చిన జానీ సినిమా తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. కాకపోతే ఒక మరాఠీ సినిమాకు దర్శకత్వం వచ్చింది. అలాగే కొన్ని సినిమాలను నిర్మించింది. కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా పనిచేసింది. 

తాజాగా మరోసారి కెమెరా ముందుకు రాబోతున్ననని ఈరోజు ఇంస్టాగ్రామ్‌లో ప్రకటించింది. కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభంకానుందని వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్ ను సాయి కృష్ణ ప్రొడక్షన్స్ లో డి ఎస్ రావు నిర్మిస్తున్నారు. దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ చేస్తున్నాడు.