భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఇక నుంచి తన మాట లెక్కచేయదనే ద్వేషం, అసూయతో భర్త చేయి నరికిన విషయం మీకు తెలిసిందే. ఈ విషయం గురించి మైక టీవీలో ఇంతకు ముందు ఓ వార్తా కథనం కూడా వచ్చింది.
ఇప్పుడు ఈ సంఘటన గురించి తాజా అప్డేట్ వచ్చింది. నర్సు ఉద్యోగం చేయకుండా కుట్రతో తన భర్త కుడి చేతిని నరికేసినా భార్య రేణు మాత్రం తన పట్టు వీడడం లేదు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుడి చేతిని కోల్పోయిన రేణు.. ఎలాగైనా ఉద్యోగం చేయాలని డిసైడ్ అయ్యింది. దాంతో ఆస్పత్రి బెడ్డుపై ఉంటూనే ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేస్తోంది. కష్టపడి చదివి సాధించిన ఉద్యోగాన్ని మాత్రం చేసి తీరుతానని వైద్య చికిత్స పొందుతూనే ప్రాక్టీస్ చేస్తోంది. కాగా, రేణు భర్త షేర్ మహమ్మద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.