నయన్ సరోగసిపై సస్పెన్స్..ఆ నివేదికలో ఏముంది? - MicTv.in - Telugu News
mictv telugu

నయన్ సరోగసిపై సస్పెన్స్..ఆ నివేదికలో ఏముంది?

October 25, 2022

నయన్ దంపతులు సరోగసి వివాదం నుంచి బయటపడతారా?బుధవారం ప్రభుత్వానికి సమర్పించబోయే విచారణ కమిటీ నివేదికలో ఏముంది?నయన్ -విఘ్నేష్ దంపతులు సరోగసి రూల్స్ పాటించారా?బ్రేక్ చేశారా? ఈ నివేదిక పరిశీలించాక తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీనిపై తమిళనాడు లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

ఎంక్వైరీ కంప్లీట్

పెళ్లియిన నాలుగునెలలకే నయన్ దంపతులు సరోగసి ద్వారా కవలలకు జన్మినించారు. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. సరోగసి రూల్స్ ని బ్రేక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై తమిళనాట తీవ్ర చర్చ జరిగింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నయన్-విఘ్నేష్ దంపతల సరోగసి వివాదంపై కమిటీ విచారణ పూర్తయింది. బుధవారం తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక అందివ్వనుంది. ఈ నివేదికలో ఏం ఉందానే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

నయన్ దంపతుల వెర్షన్
నాలుగు నెలలకే కవలలకు జన్మనివ్వడంపై నయన్ దంపతులు.. కమిటీకి అఫిడవిట్ సమర్పించారు. ఆరేళ్ల క్రితమే తమకు రిజిస్టర్ మ్యారేజ్ అయిందని స్పష్టం చేశారు. ఏడాది క్రితం సరోగసికి అప్లయ్ చేశామని వివరించారు. సరోగసి రూల్స్ ను ఎక్కడ అతిక్రమించలేదని కమిటీకి పంపిన అఫిడవిట్ లో తెలిపారు.

కమిటీ నివేదికపై సస్పెన్స్

ఈ వివాదంపై కమిటీ విచారణ పూర్తి చేసింది. బుధవారం తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక లో ఏం ఉంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవలలతో కలిసి నయన్ దంపతులు దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పండుగ రోజే చిన్నారుల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.