వనస్థలిపురంలో వివాహితపై రిపోర్టర్ అత్యాచారం..  - MicTv.in - Telugu News
mictv telugu

వనస్థలిపురంలో వివాహితపై రిపోర్టర్ అత్యాచారం.. 

September 23, 2020

Reporter issue woman complaint

కొందరు రిపోర్టర్లు బెదిరింపులకు పాల్పడడం మనకు తెలిసిందే. ప్రభుత్వాధికారుల సామాన్యుల వద్ద తీసుకునే లంచాల్లో కొందరు విలేకర్లకు వాటాలు కూడా ఉంటాయని లోకోక్తి. ఈ ఘోరాలు చాలక ఓ రిపోర్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్లాక్‌మెయిల్ చేసి వివాహితను చెరబట్టాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 

పంజగుట్టలోకి ఓ పత్రికలో పనిచేసే గోరేటి శివప్రసాద్(35) వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. అతనికి ఇంటి దగ్గర్లోనే ఉంటున్న మహిళ కుటుంబంతో పరిచయం ఉంది. దీన్ని సాకుగా తీసుకుని అతడు వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె హెచ్చరించినా మానుకోలేదు. ‘నీ ఫోటోలు, వీడియోలు ఆ వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో పెడతాను.. మర్యాదగా లొంగిపో’ అని వేధించాడు. ఆమె పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదు. దీన్ని సాకుగా తీసుకున్న ప్రసాద్ ఈ నెల 18న ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రసాద్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామం.