Maharashtra : అహ్మద్‎నగర్‎లో బోరుబావిలో పడిపోయిన 5ఏళ్ల బాలుడు. - Telugu News - Mic tv
mictv telugu

Maharashtra : అహ్మద్‎నగర్‎లో బోరుబావిలో పడిపోయిన 5ఏళ్ల బాలుడు.

March 14, 2023

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాలుడు సుమారు 15 అడుగుల దూరంలో ఉండడంతో అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు, అహ్మద్‌నగర్ జిల్లా కర్జాత్ తాలూకాలోని కోపర్డి గ్రామంలో ఒక చిన్నారి బోరుబావిలో పడిపోయిందని NDRF తెలిపింది. 5 NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయకచర్యలు చేపట్టాయి. బాలుడు తండ్రితోపాటు వ్యవసాయ భూమికి వెళ్లాడు. అక్కడి బాలుడి తండ్రి చెరుకు నరికివేత పనిలో ఉండగా..అక్కడ ఆడుకుంటున్న బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.