నిద్ర…..ఈ రోజుల్లో ఇది చాలా మందికి దొరకడం లేదు. కారణాలు ఏమైనా నిద్ర అనేది తక్కువ అయిపోయింది. దీంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది శారీరకంగా అయితే మరికొంతమంది మానసికంగా. నిద్రలేమితో బాధపడేవాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించడం, డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయం బారిన పడే ప్రమాదం కూడా ఉంది.అలాగే హైబీపీ, టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, మూర్ఛ వంటి తీవ్ర సమస్యలూ వస్తున్నాయి. ఒక వ్యక్తి ఎన్ని గంటల నిద్రపోవాలి అనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.CDC నివేదిక ప్రకారం, మధ్యవయసు వారికి అంటే 19-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు, అంతకంటే పెద్దవారికి 7 గంటల నిద్ర అవసరం. 13-18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. అదేవిధంగా, 6-12 సంవత్సరాల వయస్సు పిల్లలకు 9 నుండి 12 గంటల నిద్ర అవసరం. చిన్న పిల్లలు ఎక్కువ సమయం నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.
జెండర్ బట్టి:
ఇది ఇక్కడతో అయిపోతేదు. నిద్ర అనేది వయసుని బట్టే కాదు జెండర్ ని బట్టీ కూడా ఉంటుంది అని అంటున్నారు. మగవారి కంటే ఆడవారు ఎక్కువసేపు నిద్రపోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలు పురుషుల కంటే కనీసం 11 నిమిషాలు ఎక్కువ పడుకోవాలిట. అధ్యయనం ప్రకారం ఆడవారి మెదళ్ళు మగవారి కంటే ఎక్కువ పని చేస్తాయిట అందుకే వాళ్ళకు ఎక్కువసేపు రిలాక్సేణ్ అని అంటున్నారు నిపుణులు. సగటున ఆడవాళ్ళు మగవారి కంటే ఎక్కువ పని చేస్తారు. అంతేకాదు మల్టీటాస్కింగ్ కూడా చేస్తారు. ఇంటిపని, పిల్లలు, ఆఫీసులు ఇలా రకరకాల పనులతో రోజంతా బిజిబిజీగా ఉంటారు. అలాంటప్పుడు వారికి సరిపడనంత నిద్ర లేకపోతే అది వారి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.
హార్మోనల్ మార్పులు:
మగవారిలో కంటే ఆడవారిలో హార్మోనల్ మార్పులు ఎక్కువగా జరగుతాయి. స్త్రీలలో పీరియడ్స్, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ కారణంగా హార్మోన్లలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పురుషుల కంటే చాలా రెట్లు ఎక్కువ. శారీరక అసౌకర్యం, నొప్పి కారణంగా స్త్రీల మెదడుకు ఎక్కువ నిద్ర కావాలి. అదనంగా, మహిళలు ఆందోళన, నిరాశ వంటి పరిస్థితులకు ఎక్కువగా గురవుతారు.
బరువు:
పురుషులతో పోలిస్తే.. మహిళలకు బరువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. జనరల్ గా ఎవరైనా సరే లావుగా ఉన్నవాళ్ళు తక్కవుగా నిద్రపోతారుట. వాళ్ళకి ఎక్కువగా నిద్రలేమి సమస్య ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేమికి, అధిక బరువుకు సంబంధం ఉంటుంది. అదనంగా నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ అధికంగా విడుదల అవుతుంది. దీనివల్ల ఆకలి అధికమవుతుంది. దీని కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువ.
ఈ నిద్ర లేమి సమస్యకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చెక్ పెట్టవచ్చును. ఇది మరీ అంత జయించలేని సమస్యేమీ కాదు. దానికి స్త్రీలు చేయవల్సిందల్లా ఈ కింది పద్ధతులు పాటించడమే.
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల హ్యాపీగా నిద్ర పోవచ్చు.
నిద్రకు ముందు కాఫీ, టీలు తాగకూడదు. ఆల్కహాల్ కూడా.
నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి.
నిద్రపోయే ముందు ముఖ్యంగా త్వరగా జీర్ణం కానీ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అలాగే తిన్నతర్వాత వెంటనే నిద్ర పోకుండా కొంత సమయం గ్యాప్ తీసుకోవాలి. గంటా, రెండుగంటలు వ్యవధి ఉంటే తిన్న తిండి అరిగిపోయి, తేలికగా ఉండి పడుకోవచ్చు.
నిద్రపోయే ముందు ఫోన్లు వాడొద్దు. ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ మీ నిద్ర క్వాలిటీని దెబ్బతీస్తాయి.
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవద్దు.