ఇప్పటివరకు ఆడవాళ్లకు మాత్రమే గర్భనిరోధక మాత్రాలున్నాయి. మగవారు అయితే వేసక్టమీ, కండోమ్స్ పురుషులకు గర్భనిరోధక పద్ధతులున్నాయి. కానీ ఇప్పుడు వీరికి కూడా గర్భ నిరోధక మాత్రలు వచ్చేస్తున్నాయి.
వాలెంటైన్స్ డే రోజున.. ప్రిలినికల్ మోడల్స్ మగవాళ్ల గర్భనిరోధకం ఒక మాత్రతో సాధ్యమవుతుందని నిరూపించాయి. స్పెర్మ్ దాని ట్రాక్ లో నిలిపివేసే ఒక పిల్ విజయవంతంగా తయారైంది.
ఇన్నిరోజులు మగ గర్భనిరోధక మాత్రలు అసాధ్యమేమో అనుకున్నారు. కానీ దాన్ని కూడా శాస్త్రవేత్తలు విజయవంతం చేసేశారు. గేమ్ ఛేంజర్ గా మారిన ఆ మాత్ర గురించి నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించారు. 2000 సంవత్సరాల నుంచి మగవారి గర్భ నిరోధక మాత్రలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఏవీ ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. కానీ ఇది కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. ఇంకా ప్రిలినికల్ ప్రయోగాలు మిగిలి ఉన్నాయి.
ఎలుకలపై..
ఈ మాత్ర గురించి ల్యాబ్ ఎలుకలపై పరీక్షించారు. రెండున్నర గంటల వరకు స్పెర్మ్ ను క్రియారహితం చేసే సామర్థ్యాన్ని చూపించింది. ఎలుకల సంభోగం పై కూడా ప్రభావితం చేయలేదు. మొత్తాం 52 విభిన్న పద్ధతుల్లో ఈ పరిశోధన జరిగింది. దీని ప్రభావం స్త్రీ పునరుత్పత్తి మార్గంలో కూడా కొనసాగుతాయని తేల్చారు. మూడు గంటల వ్యవధి తర్వాత స్పెర్మ్ మోటాలిటీ తిరిగి పొందడం ప్రారంభిస్తుంది. 24 గంటల నాటికి దాదాపు స్పెర్మ్ సాధారణ కదలికలను పొందుతుంది.
గర్భ నిరోధకంగా..
ఈ మేల్ పిల్ గురించి వెయిల్ కార్నెల్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక నివేదికలో.. ఇన్సిటిట్యూట్ ఫార్మకాలజీ ప్రొఫెసర్స్, రచయితలు ఈ ఆవిష్కరణను గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు. అంతేకాదు.. పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్ అయిన డాక్టర్ మెలానీ బాల్ బాచ్ ప్రకారం.. గర్భ నిరోధకం తీసుకున్న 30 నుంచి 60 నిమిషాల్లో పని చేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. ఆ డాక్టర్.. ‘ప్రతి ఇతర ప్రయోగాత్మక హార్మోనల్ లేదా నాన్ హార్మోనల్ స్పెర్మ్ కౌంట్ ను తగ్గించడానికి, గుడ్లను ఫలదీకరణం చేయలేకపోవడానికి వారాలు పడుతుందని’ ఆమె పేర్కొంది.