వజ్రం కంటే దృఢమైన పదార్థం వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

వజ్రం కంటే దృఢమైన పదార్థం వచ్చేసింది..

October 29, 2019

భూమిపై దృఢమైన పదార్థం ఏదని అడుగుతే వెంటనే వజ్రం అని చెబుతారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యగలరు. తాజాగా స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు వజ్రం కంటే దృడమైన పదార్థాన్ని సృష్టించారు. ప్రకృతిలో సహజంగా దొరికే  బోరాన్, కార్బైడ్‌లకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ రెండింటినీ మేళవిస్తే గట్టి పదార్థాన్ని సృష్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.

diamond

యూనివర్సిటీ ఆఫ్ సెవిలె శాస్త్రవేత్తలు.. లేజర్ రేడియేషన్ ద్వారా ఈ బోరాన్ కార్బైడ్‌ను సమ్మిళితం చేసి, గట్టి పరచడంలో విజయం సాధించారు. దాన్ని గట్టి తనాన్ని వజ్రంతో పోల్చచ్చు. వజ్రం దృఢత్వం 45 గిగాపాస్కల్స్, బిగుతు 1050 జీపీఏ ఉంటుంది. ఈ సరికొత్త పదార్థం గట్టిదనం 52 జీపీఏ, బిగుతు 600 జీపీఏ ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఆల్ట్రా నిరోధక సామర్థ్యం, రేడియో యాక్టివిటీ ఉండటం దీని ప్రత్యేకతలు. భవిష్యత్తులో కార్లు, విమానాలు తదితర రవాణా వాహనాల తయారీలో ఇది సరికొత్త అధ్యాయం సృష్టించనుందని భావిస్తున్నారు. అత్యంత చవగ్గానే దీన్ని తయారు చేయగలగడం మరో విశేషం.