Resolution of five Gram Panchayats in AP to merge in Telangana
mictv telugu

మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి.. ఏపీలోని 5 గ్రామాల తీర్మానం

July 21, 2022

వరదతో భద్రాచలం పరిసర గ్రామాల మునక అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. తమను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలంటూ ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకల పాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయితీలు తీర్మానం చేశాయి. ఈ ఐదు గ్రామాలు భద్రాచల పట్టణ పరిసరాల్లో ఉండడంతో సమస్య మొదలైంది. భద్రాచలానికి ముప్పు లేకుండా కరకట్ట నిర్మాణం ఈ ఐదు గ్రామ పంచాయితీ పరిధిలోనే చేపట్టాల్సి ఉండడంతో తాజా చర్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రి పువ్వాడ కూడా ఈ ఐదు ఊళ్లను అడిగేది భద్రాచలానికి ముప్పు రాకుండా కరకట్ట నిర్మించేందుకే అనేది ఓ వాదన. ఉమ్మడి రాష్ట్రంలోనే గోదావరికి కరకట్ట నిర్మించినా, ఎంత వరద వచ్చినా ముంపు సమస్య రాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏపీలో విలీన మండలాలు, విలీన గ్రామాల అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ప్రాధాన్యంగా మారింది.