Respected Snake Researcher Dies From Rattlesnake Bite
mictv telugu

పాముల మీద అధ్యయనం.. చివరకు పాముకాటుతోనే మరణం

August 13, 2022

అరుదైన పాము జాతులమీద చిన్నతనం నుంచి పరిశోధన చేసి.. ఆ పాములను కాపాడడం కోసం ఎంతో కృషి చేసిన ప్రఖ్యాత పాము పరిశోధకుడు అదే పాము కాటుతో మరణించారు. ఆగష్టు మొదటి వారం వెస్ట్ వర్జీనియాలో పాము కాటుకు గురై ఫేమస్ స్నేక్ రీసెర్చర్ విలియం హెచ్. “మార్టీ” మార్టిన్ మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మార్టిన్ కి ప్రస్తుతం 80 ఏళ్ళు. వెస్ట్ వర్జీనియాలోని హార్పర్స్ ఫెర్రీలో తమ ఇంట్లో బందీగా ఉన్న ర్యాటిల్ స్నేక్ కరిచిందని, దీంతో ఆయన ఆగస్టు 3న మరణించినట్లు భార్య రెనీ మార్టిన్ తెలిపారు.

మార్టిన్ మృతితో కుటుంబ సభ్యులు సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో ఉన్న పరిచయాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో టాక్సికాలజీ ప్రొఫెసర్ .. పాముకాటుపై నిపుణుడు డాన్ కీలర్ మాట్లాడుతూ.. కొంతమందికి మొదటిసారి పాము కరవడం కంటే.. రెండో సారి పాము కరిస్తే.. అది ప్రాణాంతకం కావచ్చని పేర్కొన్నాడు. పాములపై పరిశోధన చేస్తున్న సమయంలో మార్టిన్ గతంలో కూడా ఒకసారి పాము కాటుకు గురయ్యాడు. అప్పుడు అతను కోలుకున్నాడు. కానీ రెండవ సారి మాత్రం ప్రాణాలు పోవడం దురదృష్టకరమని తెలిపారు.