వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన.. సాయిపల్లవి - MicTv.in - Telugu News
mictv telugu

వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన.. సాయిపల్లవి

June 17, 2022

‘నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను. కానీ, ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా, అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని నాకు తెలుసు. ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత, ఈ వివాదంపై మాట్లాడతాను” అని సాయిపల్లవి గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.

అనంతరం రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ”నేను లేని సమయంలో సాయిపల్లవిని మాట్లాడించారు. నేను ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. అయినా, ఇంత పెద్ద ప్రెస్‌ మీట్‌లో వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడి ‘విరాట పర్వం’ చిత్రం చేశాము. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను” అని అన్నారు.

మరోపక్క రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ నేడు ఏపీ, తెలంగాణలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు థియేటర్ల ముందు టపాసులు కాల్చుతూ, లేడీ పవర్ స్టార్ సాయిపల్లివి యాక్టింగ్ సూపర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ, కొందరు ఆమెపై కేసులు కూడా పెట్టారు. రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ, నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఈ వివాదంపై సాయిపల్లవి, రానా స్పందించారు.