ఫోటోలు తీసిన జర్నలిస్టులపై దాడి...! - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటోలు తీసిన జర్నలిస్టులపై దాడి…!

September 8, 2017

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని ఫోటోలు తీసిన ఫోటో జర్నలిస్టులపై హోటల్ యాజమాన్య బౌన్సర్లు దాడి చేశారు. శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాతో కలసి ముంబై బాద్రాలోని బప్టైన్ హోటల్ లో డిన్నర్ చేయడానికి వెళ్లారు. తిరిగి వెళ్తుండగా అక్కడ ఉన్న ఫోటో జర్నలిస్టులు ఫోటోలు తీసారు. విశేషం ఏందంటే..శిల్పా దంపతులు కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు,అంతా బాగానే ఉంది. కానీ ఆ జంట కార్లో కూర్చోగానే బౌన్సర్లు ఫోటో జర్నలిస్టులపై దాడి చేసి చితకబాదారు, ఈ దాడిలో సోనూ హిమాన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టు త్రీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అంతా కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు బౌన్సర్లతోపాటు జర్నలిస్టును కూడా అదుపులోకి తీసుకున్నారు.